02-04-2025 12:40:32 AM
కొత్తపల్లి, మంగళవారం 1: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్న బియ్యం పంపిణీ పథకాన్ని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ రూరల్ మండలం చర్లభూత్కూర్ గ్రామంలో ప్రారంభించారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని ధనవంతుడు పేదవాడు ఒకే రకమైన భోజనం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.గతంలో దొడ్డు బియ్యం రీసైక్లింగ్ చేసి బిఆర్‌ఎస్ నాయకులు కోట్లు దండుకున్నారని నరేందర్ రెడ్డి విమర్శించారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చుతూ పేదలకు పట్టెడన్నం పెట్టాలని ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేస్తుందని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని నరేందర్ రెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిని తిరుపతి,కాంరెడ్డి రాంరెడ్డి,నరేష్ రెడ్డి,నారాయణ గౌడ్,ఆర్‌ఐ లు కనుకరాజ్,వాస్తవిక్ గౌడ్, తిరుపతి గౌడ్, గంగయ్య గౌడ్,ప్రశాంత్ రెడ్డి మరియు డీలర్ అనిత పాల్గొన్నారు.