calender_icon.png 26 October, 2024 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సుడా చైర్మన్

01-09-2024 04:48:14 PM

వర్షాలకు నీళ్ళు నిలిచిన పలు ప్రాంతాలను పరిశీలించిన సుడా చైర్మన్ 

అలకాపురిలోని పలు రహదారుల్లో మురికి కాలువలు లేక ఎక్కడికక్కడ నిలిచిపోతున్న నీళ్ళు

పదిలక్షలు సుడా నిధులతో త్వరలో మురికి కాలువ నిర్మాణం చేపడుతామని పేర్కొన్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి

కరీంనగర్, (విజయక్రాంతి): రాష్ట్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు నగరంలో నీళ్ళు నిలిచిపోయ్యాయి. తాజాగా అలకాపురిలోని పలు ప్రాంతాలను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పరిశీలించారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా దిగువన ఉన్న అలకాపురి రోడ్డు నెంబర్ 4,5 ప్రాంతాలకు నీళ్ళు రావడం వల్ల నగరంలో మురికి కాలువలు లేకపోవడంతోనే ఎక్కడికక్కడ రహదారులపై నీళ్ళు నిలిచిపోతున్నాయని స్థానికులు తెలిపారు. నలభై ఫిట్ల సిసి రోడ్డు వరకు మురికి కాలువలో కలిపే విధంగా సుడా నుండి పది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి వెంటనే పనులు ప్రారంభిస్తామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. లక్ష్మినగర్ లోని ఆమీర్ నగర్ లో దెబ్బ తిన్న మురికి కాలువ వల్ల నీళ్ళు బయటకు వెళ్ళుట లేదని  త్వరలో మురికి కాలువ నిర్మాణానికి అధికారులతో మాట్లాడి పూర్తి చేయిస్తామని నరేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సుడా ఏఈ రమేష్, నాయకులు శ్రవణ్ నాయక్, అబ్దుల్ రెహమాన్, గడప అజయ్, గంగుల దిలీప్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, మెతుకు కాంతయ్య, ఆమెర్, లింగంపల్లి లక్ష్మణ్, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.