కరీంనగర్, (విజయక్రాంతి): నగరంలోని బ్యాంక్ కాలనీ డిమార్ట్ మెహర్ నగర్ లో విజయదశమి దసరాను పురస్కరించుకొని, శ్రీదుర్గా సేవా సమితి షమీ పూజా కార్యక్రమంలో భాగంగా ఆయుధ పూజలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. మెహర్ నగర్లో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించిన షమీ పూజలో భాగంగా జెండాను ఆవిష్కరించారు. కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు ఎల్లవేళలా సుఖశాంతులతో విలసిల్లాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలతో చల్లగా జీవించాలని, అమ్మవారిని కోరుకున్నట్లు కోమటిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో, మెహర్ నగర్ వాసులు పాల్గొన్నారు.