కరీంనగర్: చింతకుంట ఎస్ఆర్ఎస్పి కెనాల్ వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పరిశీలించారు. గత అనుభవాల దృష్ట్యా నిమజ్జనానికి వచ్చిన వాహనాలను త్వరితగతిన పంపే విధంగా క్రేన్లు పెంచాలని మైనింగ్ ఏడికి సూచించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచనలు చేశారు. జెడ్పి సిఈఓ శ్రీనివాస్, మున్సిపల్ డీఈ గంగాధర్ కొత్తపల్లి మండల, చింతకుంట గ్రామ అధికారులు సిబ్బంది ఉన్నారు.