calender_icon.png 26 December, 2024 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముషాయిరాకు హాజరైన సుడా చైర్మన్ కోమటిరెడ్డి

13-10-2024 03:57:36 PM

కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆమేర్ అలీ ఖాన్ కు కోమటిరెడ్డి ఆత్మీయ సన్మానం

కరీంనగర్, (విజయక్రాంతి): నగరంలోని ఎస్ ఎఫ్ ఎస్ గార్డెన్ లో నిర్వహించిన అఖిలభారత ఉర్దూ కవి సమ్మేళనం ముషాయిరా కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ముషాయరాలు సమాజానికి మేలుకొలుపుగా దోహదపడతాయన్నారు. సమాజంలో జరుగుతున్న సామాజిక అసమానతలను రూపుమాపేందుకు ప్రజలను తట్టి లేపేందుకు సమాజాన్ని చైతన్య పరిచేందుకు ఉర్దూ కవి సమ్మేళనాలు నిర్వహణ అత్యంత ఆవశ్యకమన్నారు కోమటిరెడ్డి. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి విచ్చేసిన సియాసత్ ఉర్దూ దినపత్రిక ఎడిటర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆమెర్ అలీఖాన్ ని శాలువా కప్పి నరేందర్ రెడ్డి ఆత్మీయంగా సన్మానించారు. ముషాయిరాకు హాజరైన సుడా చైర్మన్ కోమటిరెడ్డికి నిర్వాహకులు ఆత్మీయంగా సన్మానించారు.