calender_icon.png 24 November, 2024 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలాంటి సీన్లు కష్టంగా ఉంది

24-11-2024 03:40:07 AM

విభిన్నంగా ఆచితూచి పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది నిత్యా మీనన్. అయితే, తొలినాళ్లలో తాను ఎంచుకున్న కొన్ని పాత్రలు తనను విమర్శల పాలుచేశాయట. గోవాలోని పణజీలో జరుగుతున్న భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ (ఇఫ్పీ)లో నిత్యా మీనన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత్రల ఎంపిక, నటన గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారామె.

‘ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తేలికపాటి పాత్రలను ఎంచుకున్నందుకు నన్ను విమర్శించారు. ఆ తర్వాత కథలను ఎంపిక చేసుకునే విధానాన్ని మార్చుకున్నా. నటనకు వ్యక్తిగత అనుభవం అవసరంలేదు. అది భావోద్వేగానికి సంబంధించినది. సినిమాలో తల్లి పాత్ర పోషించడానికి అనుభవం అక్కర్లేదు. అందులో ఉండే ఎమోషన్‌ను తెరపై చూపగలిగితే సరిపోతుంది. మనం చేసే క్యారెక్టర్‌పై పూర్తి నమ్మంతో ఉండాలి.

ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే పాత్రల్ని ఎంచుకుంటే గుర్తింపు వస్తుంది. అలాగే మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి, లేకపోతే ఆ ప్రభావం మనం పోషించే పాత్రపై పడుతుంది. ఇంతకుముందు నేనెప్పుడూ విచారంగా ఉండేదాన్ని.. అందుకే ఏడ్చే సన్నివేశాలు, ఎమోషనల్ సీన్లు చేయడం పెద్దగా కష్టమయ్యేది కాదు. ఇప్పుడైతే అలాంటి సన్నివేశాలు చేయడం కొంచెం కష్టంగా మారింది. బహుశా నేనిప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నానేమో’ అని చెప్పారు. ఇక నిత్యా మీనన్ నటిస్తున్న ‘కధలిక్కా నెరమిల్లు’ నుంచి ‘యెన్నై ఇజుక్కుతాడి’ అనే పాట శనివారం విడుదలైంది. దీన్ని ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేశారు.