calender_icon.png 19 April, 2025 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మరక్షణకు ఇలాంటి విన్యాసాలు అవసరం

18-04-2025 12:13:31 AM

* మహిళా విద్యార్థులు చేతులపై కార్లు రైడ్

* కరాటి విన్యాసాలను తిలకించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి 

గోపాలపేట ఏప్రిల్ 17: ఆడపిల్లలకు ఇలాంటి కరాటే విన్యాసాలు ముఖ్యంగా అవసరమని ఎమ్మెల్యే మేగా రెడ్డి అన్నా రు. గురువారం గోపాలపేట మండల కేంద్రంలోని పద్మావతి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కరాటే విన్యాసాలను ఎమ్మెల్యే మెగా రెడ్డి తిలకించారు. గోపాలపేట కస్తూరిబా గాంధీ విద్యాలయంలో చదువుతున్న 172 మంది విద్యార్థులు మూడు నెలలపాటు వారి ఆత్మ రక్షణ కోసం కరాటే విన్యాసాలను నేర్చుకున్నారు.

గురువారం అటు విన్యాసాలు పద్మావతి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు వారు నేర్చుకున్న విన్యాసాలను ప్రదర్శించారు. కొంతమంది విద్యార్థులు వారి చేతులపై కారును పోనించి పలువుడితో శభాష్ అనిపించుకున్నారు. మరి కొంతమంది కర్ర సాము తదితర విద్య విన్యాసాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో కరాటి మాస్టర్లు సురేందర్ రాజు నిఖిల్ యాదవ్ తదితరులు ఉన్నారు