29-03-2025 12:53:00 AM
పెద్దపల్లి, మార్చి28 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహిళా శక్తి కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కోనసాగుతుంది. ఇందులో భాగంగా మహిళా సంఘాల సభ్యులచే బడి పిల్లల యూనిఫారమ్స్ కుట్టడం కోసం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక చోరువ తో అదనపు నిధులు మంజూరు చేశారు.
జిల్లాలో మూడుచోట్ల ఏర్పాటు చేయబడిన మహిళా టైలర్స్ శిక్షణ కొరకు 13 మండలాల మరియు అర్బన్ మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ ఈ నెల 31 వరకు కొనసాగనుంది. సుల్తానాబాద్ మండల సమాఖ్య కార్యాలయంలో, ఓదెల, శ్రీరాంపూర్ ఎలిగేడు, జూలపల్లి, సుల్తానాబాద్ రూరల్ & అర్బన్ , కమాన్పూర్, ఆదివారం టైలరింగ్ కో-ఆపరేటివ్ సొసైటీ నందు పెద్దపల్లి కమాన్పూర్ రామగిరి,
ముత్తారం, మంథని రూరల్ & అర్బన్ , ఎన్టీపీసీ, విక్టరీ ఫ్యాషన్ డిజైనర్ సంస్థ నందు వారి యొక్క శిక్షణ సంస్థ నందు అంతార్గం, పాలకుర్తి, ధర్మారం, పెద్దపల్లి అర్బన్, రామగుండము అర్బన్ మండలాల వారికీ శిక్షణ జరుగుతుందని, ఈ సెంటర్ల లో జరుగుతున్న శిక్షణ కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిఆర్ డిఓ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.