13-04-2025 01:50:17 AM
అపోలో ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్సలు
డా. నిఖిల్ సురేష్ ఘడియల్పతిల్
హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): వైద్య శాస్త్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో క్యాన్సర్ చికిత్స మరింత లక్ష్యసాధితంగా, తక్కువ దుష్పరిణామాలతో, చాలా ప్రభావవంతంగా మారింది. ఇది ప్రెసిషన్ ఆంకాలజీ అనే కొత్త పద్ధతికి దోహదం చేయడం వల్ల సాధ్యమైంది. ఈ విప్లవాత్మక మార్పుకు కేంద్రబిందువుగా అపోలో క్యాన్సర్ సెంటర్, హైదరాబాద్ నిలుస్తున్నది.
అక్కడ ప్రతి క్యాన్సర్ రోగికి వారి వ్యాధికి అనుగుణంగా ప్రత్యేకమైన చికిత్సా ప్రణాళిక రూపొందించబడుతుందని డా. నిఖిల్ సురేష్ ఘడియల్పతిల్, డైరెక్టర్ - మెడికల్ ఆంకాలజీ, అపోలో క్యాన్సర్ సెంటర్స్, జూబిలీ హిల్స్ చెప్పారు. అధునాతన పరీక్షలతో, ట్యూమర్ యొక్క జన్యుపరమైన నిర్మాణాన్ని గమనించి, వ్యక్తికి అనుగుణంగా ఉత్తమమైన చికిత్సను ఎంపిక చేయవచ్చని తెలిపారు.
ఒకే రకమైన క్యాన్సర్ ఉన్న ఇద్దరు రోగులు, ఒకే చికిత్సకు వేర్వేరుగా స్పందించవచ్చు. ప్రెసిషన్ ఆంకాలజీ జన్యు పరీక్షలు మరియు బయోమార్కర్లు ఉపయోగించి, రోగిలో క్యాన్సర్‌కు కారణమైన ప్రధాన అంశాలను గుర్తించి, ప్రత్యేక చికిత్సను అందించనున్నట్టు తెలిపారు. అపోలో క్యాన్సర్ సెంటర్ విజయానికి ఒక కీలక అంశం అంటే దీని మల్టీడిసిప్లినరీ ట్యూమర్ బోర్డు. ఈ బృందంలో కేవలం ఆంకాలజిస్టులు, రేడియాలజిస్టులు, పాథాలజిస్టులే కాకుండా, యూరో ఆంకాలజిస్టులు, గైనెకాలజికల్ ఆంకాలజిస్టులు, బ్రెస్ట్ క్యాన్సర్ నిపుణులు, ఎముక క్యాన్సర్ సర్జన్లు, జీ ఐ క్యాన్సర్ నిపుణులు మరియు హెడ్, నెక్ క్యాన్సర్ సర్జన్లు ఉంటారు. వారు కలిసి ప్రతి రోగి కేసును సమీక్షించి, ఒక ప్రత్యేక చికిత్సా ప్రణాళిక రూపొందిస్తారు.
దీని ద్వారా ఒక్కటైనా వివరాలు మిస్ కావు. అపోలో క్యాన్సర్ సెంటర్‌లో ఆధునిక చికిత్సలు ఇమ్యునోథెరపీ, కార్‌టీసెల్ థెరఫీ, యాంటీబాడీ-డ్రగ్ కాంజుగేట్లు, పీఆర్‌ఆర్‌టీ, అధిక ఖచ్చితత కలిగిన రోబోటిక్ సర్జరీలు, అవయవాన్ని కాపాడే శస్త్రచికిత్సలు బ్రెస్ట్ కంసర్వేషన్, లింబ్ సాల్వేజ్, స్పింక్టర్-స్పేరింగ్ సర్జరీలు ఉన్నాయని డా. నిఖిల్ సురేష్ ఘడియల్పతిల్ తెలిపారు.