12-04-2025 10:38:59 PM
భద్రాచలం (విజయక్రాంతి): శ్రీ రామాయణ పారాయణ సేవాసమితి, శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం, భద్రాచలం సంయుక్తంగా నిర్వహిస్తున్న పేద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువుల నిరంతర పంపిణీ కార్యక్రమం ఏప్రిల్ నెలలో కూడా విజయవంతంగా జరిగింది. ప్రతి నెల లాగే 42వ నెల కార్యక్రమం శనివారం నాడు సత్యసాయి సేవా సమితి, భద్రాచలం నందు శ్రీమతి నాగమణి, శ్రీమతి విజయలక్ష్మి, శ్రీ కొత్త రామలింగయ్య, శ్రీ డీవీ. శంకర రావు, ఆర్కే రామారావు చేతుల మీదుగా వితరణ కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వహించడం జరిగింది. ఆహుతులు తమ సంతోషాన్ని, కృతజ్ఞతను తెలియజేసారు. ఈ కార్యక్రమంలో RK రామారావు, DV శంకర్రావు, కోవూరు సంతోష్, శ్రీ వెలది శ్రీనివాస రావు తదితరులు పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు.