23-04-2025 12:51:17 AM
వనపర్తి, ఏప్రిల్ 22 ( విజయక్రాంతి ) : మంగళవారం వెలువడిన ఇంటర్ ఫలితాలలో జిల్లా కేంద్రంలోని సివి రామన్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులతో విజయభేరి మోగించి వనపర్తి జిల్లాలోనే చరిత్రను సృష్టించారు.
ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 993 మార్కులు చరణ్ తేజ , అర్షియా, 992 మార్కులు రాధిక, అక్షయ, విశ్వతేజ, 991 మార్కులు సంధ్య, 990 మార్కులు అక్షిత, తులసి, బైపీసీ విభాగంలో 988 మార్కులు అక్షయ, 984 మార్కులు మౌనిక, 982 మార్కులు శ్వేత, నవ్య ప్రథమ సంవత్సరంలో 900 కు పైగా 8 మంది విద్యార్థులు సాధించి జిల్లా స్థాయిలో రికార్డ్ లు సృష్టించారు.
ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రథమ ద్వితీయ సంవత్సర విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ వీరయ్య, జాన్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, కోశాధికారి కుమారస్వామి, ప్రిన్సిపల్ ప్రకాష్ మల్లికార్జున్ లు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు