22-04-2025 05:19:01 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): మున్సిపాలిటీలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల(Social Welfare Gurukul Girls College)లో ఇంటర్మీడియట్ ఫలితాలలో విద్యార్థినులు విజయదుందుభి మోగించినట్టుగా కళాశాల ప్రిన్సిపల్ కె రమా కళ్యాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రమా కళ్యాణి మాట్లాడుతూ... ఇంటర్మీడియట్ ఎంపీసీ మొదటి సంవత్సరములో 35 మంది బాలికలు పరీక్షకు హాజరుకాగా 30 మంది ఉత్తీర్ణులై.... 86%, బైపిసి గ్రూపు నుండి 34 మంది హాజరు కాగా 30 మంది విద్యార్థినులు ఉత్తీర్ణులై 88%, ఒకేషనల్ విభాగంలో 29 మంది బాలికలు హాజరు కాగా 29 మంది బాలికలు ఉత్తీర్ణులై 100% ఫలితాలు సాధించారు.
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 37 గురు బాలికలు హాజరుకాగా 37 గురు ఉత్తీర్ణులై 100%, బైపిసి గ్రూపులో.. 37 గురు బాలికలు హాజరుకాగా... 35 గురు ఉత్తీర్ణులై.... 94%, ఒకేషనల్ విభాగంలో 24 మంది బాలికలు హాజరు కాగా 23 మంది ఉత్తీర్ణులై.. 96% ఫలితాలను సాధించడం జరిగిందని తెలియజేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపులో కళాశాల టాపర్ గా కుమారి ప్రజ్ఞ 468/470 మార్కులు సాధించగా, బైపిసి గ్రూప్ కళాశాల టాపర్ గా కుమారి డి ప్రహస్య 428/440 మార్కులతో, ఒకేషనల్ విభాగంలో.. కళాశాల టాపర్ గా కుమారి శ్రీ వర్ష 493/500 మార్కులతో ఎంపీసీ గ్రూప్ కళాశాల టాపర్ గా కుమారి చిట్ల అస్మిత 994/1000 మార్కులతో విజయ కేతనం ఎగరవేశారు అని తెలిపారు.
రెండవ సంవత్సరము బైపిసి గ్రూప్ కళాశాల టాపర్ గా కె. అక్షిత 991/1000 మార్కులతో, ఒకేషనల్ విభాగములో కళాశాల టాపర్ గా. సిహెచ్. అక్షయ 987/1000 మార్కులతో విజయకేతనం ఎగరవేశారని తెలియజేశారు..అద్భుతమైన ఫలితాలను సాధించిన టాపర్ లను, ఇతర విద్యార్థినులను కళాశాల వైస్ ప్రిన్సిపల్ కే మహేశ్వరరావు, జూనియర్ లెక్చరర్స్ గీతాంజలి, స్వప్న, నిఖిత, శ్యామల, హేమలత, సుజాత లు అభినందించారు.