- నేడు టీమిండియా, దక్షిణాఫ్రికా మూడో టీ20
- రాత్రి 7 నుంచి
చెన్నై: వన్డే సిరీస్‌తో పాటు ఏకైక టెస్టు మ్యాచ్ గెలిచిన మన అమ్మాయిలు టీ20 సిరీస్‌లో మాత్రం వెనుకబడ్డారు. దక్షిణాఫ్రికాతో తొలి టీ20లో పరాజయం చవిచూసిన టీమిండియాకు రెండో టీ20లో వరుణుడి రూపంలో దురదృష్టం ఎదురైంది. ఈ నేపథ్యంలో నేడు సఫారీలతో టీమిండియా చివరి టీ20 మ్యాచ్ ఆడనుంది. మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1 ముగించాలని హర్మన్ సేన భావిస్తోంది. మరోవైపు సౌతాఫ్రికా సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అయితే ఈ మ్యాచ్‌కూ వర్షం ముప్పు పొంచి ఉంది. మన అమ్మాయిలు బ్యాటింగ్‌లో బలంగా కనిపిస్తున్నప్పటికీ బౌలింగ్‌లో మాత్రం నిరాశపరుస్తున్నారు.
వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ సౌతాఫ్రికా భారీ స్కోర్లు నమోదు చేసింది. పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ పర్వాలేదనిపిస్తున్నా.. మిగిలిన వాళ్లు మాత్రం ధారాళంగా పరుగులు ఇచ్చుకుంటున్నారు. కీలక పోరులో మనవాళ్లు ఈ పొరబాటును అధిగమించాల్సి ఉంది. స్మృతి మంధన, షఫాలీ, హర్మన్‌ప్రీత్, జేమీమా రోడ్రిగ్స్, హేమతో బ్యాటింగ్ విభాగం బలంగానే కనిపిస్తోంది. సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో తంజిమ్ బ్రిట్స్ వరుస అర్థసెంచరీలతో సూపర్ ఫామ్‌లో ఉండ గా.. ఆమెకు తోడు కెప్టెన్ వోల్వార్ట్, మారినే కాప్, అన్నెకె బోస్క్‌లు రాణిస్తుండడం సానుకూలాంశం.