calender_icon.png 18 April, 2025 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివితేనే విజయం

09-04-2025 08:38:14 PM

ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్..

అభిరామ్ ఐఏఎస్ అకాడమి ఉచిత అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్..

గ్రూప్-1 ర్యాంకర్లు సంగెపు లక్ష్మి సాహితి రాహుల్ లకు కలెక్టర్ సత్కారం..

వైరా (విజయక్రాంతి): లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివితేనే విజయం సాధ్యమని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. అభిరామ్ ఐఏఎస్ అకాడమి ఆధ్వర్యంలో సివిల్స్, గ్రూప్ 1,2 కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులుకి నిర్వహించిన ఉచిత అవగాహన కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఖమ్మంలో భక్త రామదాసు కళాక్షేత్రంలో అభిరామ్ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఓరియంటేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అభిరామ్ ఐఏఎస్ అకాడమీ ఫౌండర్  చైర్మన్ అభిరామ్ మాట్లాడుతూ... సివిల్స్ కోచింగ్ అత్యంత ప్రమాణాలుతో ఢిల్లీ స్థాయిలో ఏ మాత్రం తగ్గకుండా హైదరాబాద్ నిర్వహించడం జరుగుతుందన్నారు.

నేను ఖమ్మం జిల్లా వాడిగా, ఖమ్మం జిల్లా సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి మా అకాడమిలో నా సహాయ, సహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో గ్రూప్-1 సాధించిన సంగెపు లక్ష్మి సాహితి, రాహుల్ ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అభిరామ్ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ విలాసాగరం అభిరామ్, డేర్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ దరిపల్లి కిరణ్ కుమార్, ప్రియదర్శిని కళాశాల చైర్మన్ కాటేపల్లి నవీన్ కుమార్, శ్రీ చైతన్య కళాశాల ప్రిన్సిపాల్ మురళి కృష్ణ, కవిత మెమోరియల్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొపెసర్ అజయ్ చైతన్య, కవిత కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పవన్ కుమార్, ప్రభుత్వ మహిళ కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత, అకాడమీ ఫాకల్టీ, వివిధ కళాశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.