గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
యాదాద్రి భువనగిరి/జనగామ, ఆగస్టు 29(విజయక్రాంతి): ప్రజలు, అధికారులు, పాలకులు సమన్వయంతో పనిచేసి విజయాలను అందుకోవాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. గురువారం ఆయన జనగామ కలెక్టరేట్‌కు విచ్చేశారు. ఆయనకు పలువురు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై కలెక్టర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. కళాకారులు, కవులు, రచయితలకు జన్మనిచ్చిన జనగామ గడ్డపై అడుగుపెట్టడం తన అదృష్టమని అన్నారు.
చేనేత ఉత్పత్తి కేవలం ఒక వస్త్రం కాదని అది ఒక వ్యక్తి పోరాటాన్ని ప్రతిబింబించే చరిత్ర అని చెప్పారు. తొలుత గవర్నర్ కొలనుపాకలోని జైన తీర్థకరుడు మహావీర్ ఆలయాన్ని గురువారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు. ఆయనకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతు కే జండగే స్వాగతం పలికారు. వీరశైవ సంప్రదాయ సోమేశ్వర ఆలయంలో వేదపండితులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ భువనగిరి సమీపంలోని స్వర్ణగిరి వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు.