విద్యాశాఖ కమిషనర్ నర్సింహారెడ్డి
హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): ఒత్తిడిని జయిస్తేనే పరీ క్షల్లో విజయం సాధించవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, కమిషనర్ ఈవీ.నర్సింహారెడ్డి విద్యార్థులకు సూచించారు. మేడ్చల్ జిల్లా ప్రతాప సింగారం, ఘట్కేసర్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా తొమ్మిది, పదో తరగతి విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. ఒత్తిడిని ఎలా జయించా అనే దానిపై ఉదహరణలతో సహా వివరించారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు మ్యాథ్స్ పాఠాలు బోధించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు జి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.