calender_icon.png 16 November, 2024 | 8:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇష్టంగా చదివితేనే విద్యలో రాణింపు

16-11-2024 05:33:13 PM

మానకొండూర్ (విజయక్రాంతి): విద్యార్థులు ఇష్టంగా చదివినప్పుడే చదువుల్లో రాణించగలుగుతారని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మింగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. అంతే కాకుండా విద్యార్థులకు పాఠాలు కూడా బోధించారు. అనంతరం ఆయన ఉపాధ్యాయులు, విద్యార్థలనుద్దేశించి మాట్లాడుతూ.. ఇష్టంగా చదివే విద్యార్థులు మాత్రమే చదువుల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు. చదువుపై ప్రత్యేక శ్రద్ధ, ఆసక్తి కనబర్చాలన్నారు.

చాలా మంది విద్యార్థులు గణితంపై ఆసక్తిని కనబర్చరని, అలాంటి వారిలో ఇష్టం పెంచేందుకే ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఎంతోమంది వివిధ రంగాల్లో ఉన్నతస్థానాల్లో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. తాను కూడా సర్కార్ బడిలోనే చదివానన్నారు. ఎమ్మెల్యే వెంట తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, పార్టీ నాయకులు టి. శ్రీనివాసరావు, గంకిడి లక్ష్మారెడ్డి, చింతల లక్ష్మారెడ్డి, కవ్వంపల్లి యువసేన జిల్లా అధ్యక్షుడు నోముల అనిల్ కుమార్,ఎస్.శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.