హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 5(విజయక్రాంతి): సవాళ్లను అధిగమిస్తేనే సివి విజయం సాధించవచ్చని ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఎఎస్ అకాడమీ చైర్మన్ పి.కృష్ణప్రదీప్ అన్నారు. బుధవారం ట్వంటీఫస్ట్ సెం ఐఏఎస్ అకాడమీ సహకారంతో వింగ్స్ మీడియా, జి5 మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో మొయినాబాద్‌లోని జేబీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో “మొదటి ప్రయత్నంలో సివిల్ సర్వీసులను ఎలా క్రాక్ చేయాలి” అనే అంశంపై సెమినార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కరీంనగర్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పమేలా సత్పతి ఐఏఎస్ సాధించడంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి వివరించారు. పాఠశాల రోజుల్లో ఆమెను సహచరులు తక్కువ చేసినా ఆమె పట్టుదల, అంకితభావంతో సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించిందని ఉదాహరణగా చెప్పారు.
అకాడమీ చీఫ్ మెంటర్ కమ్ డైరెక్టర్ డాక్టర్ భవానీ శంకర్ మాట్లాడుతూ.. యూపీఎస్సీ విజయం ఉన్నత సంస్థల విద్యార్థులకు మాత్రమే పరిమితమైందనే అపోహను తోసిపుచ్చారు. జేబీఐఈటీ ప్రిన్సిపాల్ డాక్టర్ పీసీ కృష్ణమాచారి మాట్లాడుతూ.. విద్యార్థులు ఈ సెమినార్ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
ట్వంటీ ఫస్ట్ సెంచరీ అకాడమీకి చెందిన పుస్తకాలను ప్రిన్సిపాల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ జే.వి. కృష్ణారావు, కెరీర్ గైడెన్స్ సెల్ కోషూ , టీపీవోడా ఎం.ఆసిఫ్, హెచ్‌వోడీ ఈఎంసీ డాక్టర్ నరసప్ప రెడ్డి , డీన్-అడ్మిన్ డాక్టర్ హిమాన్షు శర్మ, డీన్ సీఎస్ డాక్టర్ వెంకట కృష్ణ , డైరెక్టర్, వింగ్స్ మీడియా, జీ5 మీడియా గ్రూప్ గిరి ప్రకాష్, ఎడిటర్ గణేష్, మేనేజర్ మహేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.