ట్వంటీ ఫస్ట్ సెంచరీ అకాడమీ చైర్మన్ కృష్ణప్రదీప్
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): సివిల్స్‌లో విజయం సాధించడం కష్టమేమీ కాదని ట్వంటీ ఫస్ట్ సెంచరీ అకాడమీ చైర్మన్ పీ కృష్ణప్రదీప్ అన్నారు. శనివారం మెహదీపట్నంలోని జీ పుల్లారెడ్డి డిగ్రీ కాలేజీలో సివిల్స్ ఆస్పిరెంట్స్ క్లబ్‌ను ఆ కాలేజీ సెక్రటరీ పీ సుబ్బారెడ్డి, ట్వంటీ ఫస్ట్ అకాడమీ ప్రతినిథులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కృష్ణప్రదీప్ మాట్లా డుతూ.. ట్వంటీ ఫస్ట్ సెంచరీ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అకాడమీ డైరెక్టర్, చీఫ్ మెంటర్ డా.భవానీ శంకర్ మాట్లాడుతూ.. తమ అకాడమీ ఉచిత మాస్ట ర్ తరగతులను అందజేస్తోందని తెలిపారు.
కాలేజీ ప్రిన్సిపాల్ కె.మురళికృష్ణ మాట్లాడుతూ 250 మంది విద్యార్థులు సివిల్స్ ఆస్పిరంట్స్ క్లబ్‌లో నమోదు చేసుకున్నారని వారిలో 103 మందిని ఆసక్తి ఆధారంగా ఎంపిక చేశామని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, వింగ్స్, జీ5మీడియా, ప్రతినిధులు గిరిప్రకాష్, గణేష్, మహేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.