calender_icon.png 15 March, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాషపై పట్టు ఉంటే విజయం సులభమౌవుతుంది

15-03-2025 07:07:03 PM

జిల్లా కలెక్టర్ మను చౌదరి..

చేర్యాల (విజయక్రాంతి): భాషపై పట్టుంటే భావవ్యక్తీకరణ పరిపూర్ణంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. కొమరవెల్లి మండలంలోని గురువన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ద్వారా ఏర్పాటు చేసిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ) కంప్యూటర్ ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2002లో ప్రారంభించిన ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషన్ లిటరసీ న్యూమరాసి) ప్రోగ్రాం ద్వారా పాఠశాల విద్యార్థులకు గణితం, తెలుగు అభ్యాసన సామర్థ్యం పెంచేందుకు కృషి జరుగుతుందన్నారు.

అందులో భాగంగానే ఏఐ కార్యక్రమాన్ని అమలు చేయడానికి జిల్లాల్లో 31 పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. భాషపై పట్టు సాధిస్తే విజయం సులభం అవుతుందన్నారు. ఇతరల గురించి ఆలోచించకుండా మనం చేసే పనిపై పూర్తిగా దృష్టి సారిస్తే విజయం సాధించవచ్చు అని విద్యార్థులకు సూచించారు. కష్టపడి చదువుతే సివిల్స్ నైనా సాధించవచ్చు అన్నరు. పదో తరగతి విద్యార్థులు అన్ని సబ్జెక్టులు చదువుతూనే కష్టమైన సబ్జెక్టు పై ఫోకస్ పెట్టాలని సూచించారు. విలువలతో కూడిన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లాలోని పాఠశాలలలో మౌలికవసతుల కల్పనకు 30 కోట్లతో పనులు జరుగుతున్నాయని, ఇప్పటికే 19 కోట్లు నిధులు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో డిఇఓ శ్రీనివాస్ రెడ్డి, విద్యాశాఖ సెక్టోరల్ అధికారి రామస్వామి ఎంఈఓ బి రమేష్ వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.