06-03-2025 12:00:00 AM
నిర్మల్ మార్చ్ 5 (విజయక్రాంతి): జనవరి 22 నుంచి మార్చి 8 వరకు నిర్వహించిన బేటి పడావో బేటి బచావో కార్యక్రమం అందరి సహకారంతోని విజయవంతం అవుతుందని జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ న్యాయమూర్తి రాధిక అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 8న నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బేటి పడావో బేటి బచావో కార్యక్రమం ముగించడం జరుగుతుందన్నారు. 42 రోజులపాటు జిల్లా వ్యాప్తంగా బాలికలకు భరోసా కల్పించడం బాలికల చట్టాలపై అవగాహన కల్పించడం ఆర్థిక విద్య అభివృద్ధి పథకాలను వివరించడం బాల్యవివాల నిషేధం తదితర వాటిపై అవగాహన కల్పించడం జరిగిందని వారు తెలిపారు. బాలికలు చదువుకున్నప్పుడే సమాజంలో చట్టాలపై అవగాహన ఉంటుందని జడ్జి రాధిక తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది నాగమణి వైద్యాధికారి డాక్టర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.