మందమర్రి (విజయక్రాంతి): హైదరాబాద్ ఎల్బీనగర్ లో జనవరి 19న నిర్వహించనున్న మాదిగల మహాగర్జన సభను విజయవంతం చేయాలని అంబేద్కర్ సేన రాష్ట్ర కార్యదర్శి తుంగపిండి రాజేష్ కుమార్ కోరారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం మహాగర్జన కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. మాదిగ ఉపకులాల ఎబిసిడి వర్గీకరణ, అంబేడ్కర్ అభయ హస్తం 12 లక్షల పథకంను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరి, కొలిపాక సాంబయ్య, జూల శ్రీనివాస్ కాజీపేట స్వామి, బచ్చలి భీమయ్య, కాంపల్లి రమేష్, టి రమేష్ లు పాల్గొన్నారు.