calender_icon.png 10 October, 2024 | 4:55 AM

సమీప మున్సిపాలిటీల్లోకి శివారు పల్లెలు

04-09-2024 12:37:39 AM

ఔటర్ సమీపంలోని 52 గ్రామాలు 13 మున్సిపాలిటీల్లో విలీనం

గెజిట్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

పంచాయతీ రికార్డులను మున్సిపాలిటీలకు అందించాలని ఆదేశాలు

2024, మే నెలలోనే చెప్పిన విజయక్రాంతి

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): హైదరా బాద్ శివారు పల్లెలు పట్టణాలుగా మారనున్నాయి. ఔటర్ రింగ్‌రోడ్‌కు సమీపంలో ఉన్న గ్రామాలను వాటికి దగ్గరలోని మున్సిపాలిటీ ల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం మంగళవారం గెజిట్ విడుదల చేసింది. పంచాయతీ రికార్డులను సైతం మున్సిపాలిటీలకు అప్పగించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఔటర్ వెంట ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని సుమారు 13 మున్సిపాలిటీల్లో మొత్తం 52 గ్రామాలను విలీనంచేశారు.

ప్రభు త్వ ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం తెలపడంతో రంగారెడ్డి జిల్లాలోని 12 గ్రామాలు, మేడ్చల్‌లోని 29 గ్రామాలు, సంగారెడ్డిలోని 11 గ్రామాలు పట్టణాలుగా మారనున్నాయి. హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని పలు గ్రామాలు నగరంతో పోటీ పడుతూ అభివృద్ధి చెందుతున్నాయి.

ఈ క్రమంలోనే గత ప్రభు త్వం 2020లో రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు మేడ్చల్ జిల్లాలో 4 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలను, రంగారెడ్డి జిల్లా పరిధిలో 13 మున్సిపాలిటీలతోపాటు 3 కార్పొరేషన్లను, సంగారెడ్డి జిల్లాలో 3 మున్సిపాలిటీలను ఏర్పా టు చేసింది. దీంతో నగర శివారులోని గ్రామా లు మరింత అభివృద్ధి చెందాయి. ప్రస్తుతం మరికొన్ని గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనమవనున్నాయి. తద్వారా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లా ల్లో పట్టణీకరణ మరింత పెరిగి ఆయా ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయని అధికారులు చెబుతున్నారు.