26-03-2025 12:00:00 AM
రామాయంపేట, మార్చి 25ఃరాష్ట్రీయ కృషి వికాస యోజన, సబ్మిషన్ అగ్రికల్చర్ మేకనైజేషన్ లో భాగంగా మహిళా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని సహ వ్యవసాయ సంచాలకులు రాజ్ నారాయణ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించిన మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీపై, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీపై యంత్ర పరికరాలు అందజేయడం జరుగుతుందన్నారు.
రామాయంపేట మండలానికి 4 బ్యాటరీతో నడిచే చేతి పంపులు, మూడు తైవాన్ పంపులు, ఒక రోటవేటర్ షెడ్యూల్ కులాలకు చెందిన మహిళ రైతులకు మాత్రమే కేటాయించబడిందని, అలాగే ఒక ట్రాక్టర్, రెండు కల్టివేటర్లు, ఒకటి గట్టు చేసే యంత్రాలు కేటాయించబడినట్లు తెలిపారు. తప్పనిసరిగా మహిళా రైతులకు మాత్రమే పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను అప్లికేషన్ ఫారంతో అందజేయాల్సి ఉంటుందన్నారు. ట్రాక్టర్ స్వయం సహాయక బృందాలు గానీ రైతు మిత్ర గ్రూపులు కానీ రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు మాత్రమే కేటాయించడం జరిగిందన్నారు.