ముషీరాబాద్,(విజయక్రాంతి): బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య(MP R Krishnaiah) డిమాండ్ చేశారు. గురువారం కాచిగూడలోని ఓ హోటల్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చెరుకు మణికంఠ(BC Welfare Association State Secretary Cheruku Manikantha) అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. దళిత బంధు(Dalit Bandhu) మాదిరిగా బీసీ బంధును పెట్టాలన్నారు. తమ న్యాయమైన వాటాకోసం బీసీలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, మల్లేష్, రామకృష్ణ, అంజి, నందగోపాల్, రాజు, ఉదయ్, రాందేవ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.