* కేజ్రీ లేఖపై స్పందించిన ఈసీ
* నేటి రాత్రి 8 వరకు ఆధారాలివ్వాలని ఆదేశం
న్యూఢిల్లీ, జనవరి 28: యమునా నదిలో హర్యానా ప్రభుత్వం కావాలనే విషపదార్థాలు కలుపుతోందని ఆరోపిస్తూ ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఈసీకి లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన ఈసీ నేడు రాత్రి 8 గంటలలోపు ఇందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కేజ్రీవాల్‌కు లేఖ రాసింది.
యమునా నదిలో అమ్మోనియా శాతం పెరిగిందన్న వార్తలపై జనవరి 28లోపు నివేదిక సమర్పించాలని ఈసీ హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ ఆరోపణలపై హర్యానా ప్రభుత్వం దావా వేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఓట్ల కోసం బీజేపీ డర్టీ పాలిటిక్స్ చేస్తూ.. తాగే నీటిలో విషయం కలుపుతోందని కేజ్రీ ఎన్నికల ర్యాలీలో ఆరోపించారు.
హర్యానా ప్రభుత్వానిది జల ఉగ్రవాదం
“హర్యానా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా యమునా జలాలను కాలుష్యం చేస్తున్నది. ఇది జల ఉగ్రవాదం” అని ఢిల్లీ సీఎం అతిషీ విరుచుకుపడ్డారు. మంగళవారం ‘ఎక్స్’ వేదికగా లేఖ విడుదల చేశారు. ‘యుమనా నదిలో గతంలో కంటే అమ్మోనియా స్థాయి ఆరు రెట్లు పెరిగింది. ఆ రసాయనం మానవాళికి చేటు చేస్తుంది. కలుషిత జలాల ను ప్రభుత్వం శుద్ధి చేయించలేదు.
ఢిల్లీ జల్ బోర్డు పరిధిలోని నీటి శుద్ధి ప్లాంట్లు కేవలం 1 పీపీఎం వరకు మాత్రమే అమ్మోనియాను శుద్ధి చేయగలవు. హర్యానా నుంచి వస్తున్న జలా ల్లో 1 పీపీఎం కంటే ప్రమాదకరస్థాయిలో అమ్మోనియా ఉంది. కాలుష్యం కారణంగా ఢిల్లీవ్యాప్తంగా 15 నీటి సరఫరా తగ్గిపోయింది. నదీ కాలుష్యం ఎన్నికలపై ప్రభావం చూపుతుంది. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి. ’ అని సీఎం డిమాండ్ చేశారు.