calender_icon.png 15 November, 2024 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీటీవీ ఫుటేజీ సమర్పించండి

13-11-2024 02:03:12 AM

అక్రమ నిర్బంధంపై సీపీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్ నవంబర్ 12 (విజయక్రాంతి): పోలీసులు ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి వేధింపులకు గురిచేశారన్న ఆరోపణల నేపథ్యంలో అక్టోబరు 28 నుంచి 31 వ తేదీ వరకు ఉస్మానియా పోలీసు స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని సమర్పించాలని నగర పోలీసు కమిషనర్‌కు హైకోర్టు ఆదేశా లు జారీచేసింది. ఈ నెల 18న ఫుటేజీ సమర్పించాలని పేర్కొంటూ అదే తేదీకి విచారణ వాయిదా వేసింది.

తన సోదరుడిని పోలీసు లు అక్రమంగా నిర్బంధించడంతోపాటు తమను బెదిరించి తమపైనా కేసు నమోదు చేయడంపై రాగన్నగూడెంకు చెందిన న్యాయవాది జే జోయల్ అతని సోదరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీ విజమ్‌సేనారెడ్డి విచారణ చేపట్టా రు. పిటిషనర్ తరఫు న్యాయవాది కదిరె అజిత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ సోదరుడు భరత్ సింహారెడ్డికి మానసిక అనారోగ్యం ఉందని తెలిసినా పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని అన్నారు.

అత డి నుంచి బలవంతంగా ఫోన్ లాక్కున్నారని తెలిపారు. 18 గంటలపాటు పోలీసు స్టేషన్లో కూర్చోబెట్టారని, బీఎన్‌ఎస్‌ఎస్ 35(3) సెక్షన్ నిబంధనలను అమలు చేయలేదని తెలిపారు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని చెప్పారు. రిమాండ్ డైరీలోని వాస్తవాలను పోలీసులు తారుమారు చేశారని ఆరోపించారు. 

నిబంధనలకు విరుద్ధంగా పిటిషనర్ సోదరుడి హక్కులకు భంగం కలిగించిన ఉస్మానియా పోలీసు స్టేషన్ ఎస్‌ఎచ్‌వో, ఎస్‌ఐ కాశయ్యపై శాఖాపరమైన చర్యలు తీసుకునేలా పోలీస్ కమిషనర్‌ను ఆదేశించాలని కోరారు.

మానసిక వ్యాధితో జైలులో ఉన్న సోదరుడికి మందులు అందించే అవకాశాన్ని కల్పించాలని కోరారు. అక్రమంగా నిర్బంధించినందుకు రూ.10 లక్షల పరిహా రం ఇప్పించాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి సీసీటీవీ ఫుటేజీని సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు.