- 155 పరుగులకే కుప్పకూలిన టీమిండియా
- నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా విజయం
- రోహిత్, కోహ్లీ విఫలం.. జైస్వాల్ పోరాటం వృథా
- డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌కు దగ్గరైన ఆసీస్
భారత్ ఆలౌట్ అనంతరం విజయోత్సాహంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు
మెల్‌బోర్న్: బోర్డర్ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా పరాజయం చవిచూసింది. 340 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 155 పరుగులకే పరిమితం కావడంతో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందు కుంది. భారత బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్ (84) ఒంటరి పోరాటం చేసినప్పటికీ అతనికి సహకరించేవారు కరువ య్యారు.
రిషబ్ పంత్ (30) పర్వాలేదనిపించాడు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమవ్వడం జట్టు ఓటమికి ప్రధాన కారణమైంది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలండ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. లియోన్ 2 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న కెప్టెన్ కమిన్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సొంతం చేసుకున్నాడు.
ఈ విజయంతో ఆస్ట్రేలియా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 2 ఆధిక్యంలో నిలిచింది. ఫలితంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ బెర్త్ దక్కించుకునేందుకు ఆసీస్ మరింత దగ్గరవ్వగా.. ఓటమితో భారత్ ఫైనల్ ఆడే అవకాశాన్ని మరింత క్లిష్టం చేసుకుంది. సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య ఆఖరి టెస్టు సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి జరగనుంది.
జైస్వాల్ మినహా..
228/9 క్రితం రోజు స్కోరుతో ఐదోరోజు బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా మరో ఆరు పరుగులు జత చేసి 234 పరుగులకు ఆలౌటైంది. లియోన్ (41) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. భారత బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా 5 వికెట్ల ప్రదర్శనతో మెర వగా.. సిరాజ్ 3 వికెట్లు తీశాడు. అనంతరం 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆది నుంచే కష్టాలు మొదలయ్యా యి.
ఓపెనర్ జైస్వాల్ ఓపిక ప్రదర్శించినప్పటికీ అతడికి సహకరించేవారు కరువయ్యా రు. కెప్టెన్ రోహిత్ (9) మరోసారి కమిన్స్ చేతికి చిక్కాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కేఎల్ రాహుల్ డకౌట్ కాగా.. విరాట్ కోహ్లీ (5) పూర్తిగా నిరాశపరిచాడు. దీంతో భారత్ 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిం ది.
మరో రెండు గంటలు నిలబడితే మ్యాచ్ డ్రా అవుతుందనుకున్న తరుణంలో ఆసీస్ బౌల ర్లు చెలరేగిపోయారు. హెడ్ బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడిన పంత్ మూల్యం చెల్లించుకోగా.. జడేజా, నితీశ్ పెవిలియన్ చేరాడు. జైస్వాల్ వివాదాస్పద రీతిలో ఔటవ్వడంతో భారత్ ఓటమి ఖరారైంది. సుందర్ (5) నాటౌట్‌గా మిగిలాడు.