గద్వాల, జనవరి 26 ( విజయక్రాంతి ) : తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టడం జరిగింది ఇప్పటికీ 13 నెలలు పూర్తి కావడం జరిగింది ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలో భాగంగా రెండు గ్యారెంటీలను అమలు చేయడం జరిగింది నేడు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతిష్టాత్మంగా నాలుగు పథకాలను అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు.
ఆదివారం గద్వాల నియోజకవర్గం లో కె.టి దొడ్డి మండల పరిధిలోని ఉమిత్యాల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన భాగంగా 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం అమలు చేసిన ఇందిరమ్మ భరోసా, రైతు ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయిన వారికి అర్హులైన ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, *జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా కలెక్టర్ తో కలిసి సంక్షేమ పథకాలకు సంబందించి అర్హులకు ప్రొసీండింగ్ పత్రాలను అందచేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నాలుగు పథకాలు రేపటి నుండి ప్రజలకు వర్తించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.