11-03-2025 12:00:00 AM
మఠంపల్లి, మార్చి 10: కాంగ్రెస్ ప్రభు త్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మఠంపల్లి తాహశీల్ధార్ లావూరి మంగాకు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం ఎన్నికల ముందు రాష్ర్ట ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి నేడు వాటిని అమలు పరచడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఆవే దన వ్యక్తం చేశారు. రుణమాఫీ విషయంలో సాంకేతిక కారణాలు సాకుగా చూపి సగం మంది రైతులకు మాఫీ కాని పరిస్థితి రైతు భరోసా ఎకరానికి 15000 ఇస్తామని 12000 కుదించి నేటికీ రెండు ఎకరాల వరకు కూడా పూర్తిగా ఇవ్వలేక పోయారని, ఉచిత బస్సు సౌకర్యం మినహిస్తే మిగతా సంక్షేమ పథకాలు ఏవి అమలు కావడం లేదని సమస్యల పరిష్కారం కొరకు సిపిఎం పోరుబాట నిర్వహిస్తుందని దీనికి అందరు సహకరించాలని కోరారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యుల పాండు నాయక్, మండల కార్యదర్శి బాలునాయక్, మండల కమిటీ సభ్యులు రాము పాల్గొన్నారు.