calender_icon.png 22 April, 2025 | 10:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఐ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత

16-12-2024 08:01:22 PM

లక్షేట్టిపేట (విజయక్రాంతి): మండలంలో ఉన్న ప్రభుత్వ భూములను సర్వే చేసి పేదలకు ఇంటి స్థలాలు, సాగుభూములు ఇవ్వాలని సాగులో వున్న వారికి పట్టాలు ఇవ్వాలని సోమవారం స్థానిక తాహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి దేవవరం మాట్లాడుతూ... అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చిన గత ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. కావున వెంటనే సర్వే చేసి పేదలకు ఇంటి స్థలాలు, సాగుభూములు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. లేని ఏడల కమ్యూనిష్టు పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని  హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి రాచర్ల రవి కిరణ్, యువజన సంగం మండల కార్యదర్శి లింగంపెల్లి బాను చందర్, రైతు సంగం మండల కార్యదర్శి ఆకుల రామన్నలు పాల్గొన్నారు.