calender_icon.png 19 March, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యలపై డిప్యూటీ తహశీల్దార్ కి వినతిపత్రం అందజేత

19-03-2025 06:46:05 PM

మఠంపల్లి: సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మఠంపల్లి తహశీల్దార్ కార్యాలయం ముందు స్థానిక ప్రజా సమస్యలపై డిప్యూటీ తహశీల్దార్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు భూక్య పాండు నాయక్, సిపిఎం మండల కార్యదర్శి మాలోతు బాలు నాయక్ మాట్లాడుతూ... మండలంలో అంతర్గత రోడ్లను వెంటనే శాంక్షన్ చేయాలని, పల్లె వెలుగు బస్సులను అన్ని గ్రామాల్లో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని, రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతులకు బోనస్ ఇవ్వాలని, ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇళ్లు కోసం దరఖాస్తులు చేసుకున్నారు.

రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, ఉపాధి హామీ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు దరఖాస్తులు పెట్టుకొని సంవత్సరం కాలం గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు ఈ పథకాల విషయంలో ఎలాంటి సమాధానం ఇవ్వకుండా దాటవేయటం సరైన పద్ధతి కాదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎస్. జగన్ మోహన్ రెడ్డి, కే .వెంకట్ రెడ్డి, పొడిచెట్టి రాము, పి. జీవన్, శీను తదితరులు పాల్గొన్నారు.