calender_icon.png 4 March, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్మిషన్ గడువు పొడిగించాలి

04-03-2025 02:18:29 AM

2018 బ్యాచ్ పీహెచ్‌డీ విద్యార్థుల డిమాండ్

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 3 (విజయక్రాంతి): 2018 బ్యాచ్ పీహెచ్‌డీ సబ్మిషన్ గడువు పొడిగించాలని, ఈ విషయంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్, రిజిస్ట్రార్ స్పందించాలని పీహెచ్‌డీ విద్యార్థులు కోరారు. సోమవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట 2018 బ్యాచ్ పరిశోధక విద్యార్థులు నిరసన తెలిపారు. తమ పరిశోధనలకు ఒక సంవత్సరం గడువు పొడిగించాలని కోరారు. ఈ విషయమై వీసీ, రిజిస్ట్రార్ ఈ ఏడాది ఫిబ్రవరి 28 లోపు తెలియజేస్తామని చెప్పి  ఇప్పటి వరకు స్పందించడంలేదన్నారు. 

2019లో తమ అడ్మిషన్ల రిజి  ప్రక్రియ ముగిశాక కరోనా రావడం తో తాము రెండు సంవత్సరాలు కోల్పోయామన్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం అన్ని యూనివర్సిటీలు గడువు పొడగింపును పాటిస్తున్నాయని, ఓయూలో కూడా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిశోధక విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు అర్‌ఎల్ మూర్తి, తప్పేట్ల ప్రవీణ్‌కుమార్, రవి, చందు, అరుణ్ ఆదివాసీ, షాగంటి రాజేష్, వెంకన్న, క్రాంతి జరవీందర్, నరేష్ పాల్గొన్నారు.