calender_icon.png 4 April, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈజిప్ట్‌లో జలాంతర్గామి మునక.. ఆరుగురు మృతి!

28-03-2025 12:08:27 AM

కైరో: ఈజిప్ట్ తీర నగరమైన హుర్‌ఘడలో ఎర్ర సముద్రంలో పర్యాటకుల నౌక మునిగిపోయింది. ప్రమాద సమయంలో సబ్‌మెరైన్‌లో దాదాపు 40 మంది ఉండగా వీరిలో ఆరుగురు మృతి చెందినట్టు తెలిసింది. మరో తొమ్మిది మందికి గాయాలు కాగా అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. హుర్‌ఘడ నగరం పర్యాటకానికి ఎంతో ప్రసిద్ధి. ఇక్కడి బీచ్‌లు, పగడపు దిబ్బలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. దీంతో పర్యాటక జలాంతర్గాములు ఇక్కడ సేవలందింస్తుంటాయి. ఇందులో సింద్‌బాద్ అనే టూరిస్ట్ సబ్‌మెరైన్ కూడా ఒకటి. సముద్రంలో 25 మీటర్ల లోతు వరకు పర్యాటకులను అనుమతిస్తుంటారు. హుర్‌ఘడలో కొంతకాలంగా పర్యాటక పడవల ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. గత నవంబర్‌లోనూ ఓ టూరిస్టు బోటు మునిగిపోయిన ఘటనలో బ్రిటిష్ జంట సహా 16 మంది ప్రాణాలు కోల్పోయారు.