calender_icon.png 17 January, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పరిధిలోని అంశం

11-09-2024 12:34:17 AM

రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్

హైదరాబాద్,సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): బీసీల కుల గణనను వేగవంతం చేసేందుకే రాష్ట్రప్రభుత్వం బీసీ కమిషన్ కొత్త పాలక వర్గాన్ని నియమించింది. ఆ దిశగా చర్యలు ఇప్పటికే ప్రారంభించాం. ప్రస్తుతం హైకోర్టు తీర్పు మేరకు పనిచేస్తాం. ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం తలుచుకుంటేనే ఏ ఎన్నికైనా జరుగుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీ కాలం ముగిసింది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులే తలెత్తాయి. స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసిన వెంటనే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేస్తుంది. దీనిలో భాగాంగనే ఇప్పుడు షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు ప్రభుత్వ పరిధిలోని అంశం కాబట్టి సర్కార్ ఆదేశంతోనే నిర్ణయం తీసుకుంటాం.