కరీంనగర్,(విజయక్రాంతి): సుభాష్ చంద్రబోస్(Subhash Chandra Bose) దేశాలు తిరిగి ఆయుధాలను సమకూర్చి ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేసి స్వతంత్ర పోరాటం చేసిన మహానీయులని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు(Mayor Yadagiri Sunil Rao) అన్నారు. కరీంనగర్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని సుభాష్ నగర్ లో ఆయన విగ్రహానికి గురువారం నగర మేయర్ యాదగిరి సునీల్ రావు పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సుభాష్ చంద్రబోస్ స్వాతంత్య్ర పోరాటంలో దేశం కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ సంధర్బంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ... నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ పౌజ్ సంస్థ(Azad Hind Fauj organization)ను స్థాపించి... భారత దేశ స్వాతంత్య్రం(India independence) కోసం బ్రిటీష్ రాజ్ కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు. ఇంతటి పోరాట పటిమను చూపిన సుభాష్ చంద్రబోస్ స్పూర్తితో ఆరోజుల్లో స్వాతంత్ర్య పోరాటాలు చేసి మన దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టారని అన్నారు. ఇలాంటి మహనీయుల జయంతి, వర్థంతిలను జరుపుకొని స్మరించుకోవడం, పోరాటాలను గుర్తు చేస్కోవడం మన బాధ్యత అన్నారు. ఇదే స్పూర్తిని నేటి యువత తీస్కోని వారి బాటలో నడవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ అర్ష కిరణ్మయి మల్లేషం డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.