calender_icon.png 20 January, 2025 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా సుభాష్

20-01-2025 05:11:30 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సమాచార హక్కు పరిరక్షణ కమిటీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా నిర్మల్ కు చెందిన బైరిపల్లి సుభాష్ ను నియమిస్తూ జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్ సోమవారం నియామకపత్రం అందజేశారు. సంఘం ద్వారా ప్రజలకు సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంచేందుకు ముచ్చట జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు బోర్డులను ఏర్పాటు చేసినప్పటికీ సమాచారం అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.