న్యూఢిల్లీ: భారత నంబర్‌వన్ గోల్ఫ్ ప్లేయర్ శుభాంకర్ శర్మ ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అతడితో పాటు గగన్‌జీత్ బుల్లర్ కూడా ఒలింపిక్స్ బెర్త్ అందుకున్నాడు. పారిస్ క్రీడల్లో పురుషు ల, మహిళల విభాగం నుంచి 60 మంది పో టీ పడనున్న గోల్ఫ్ ఈవెంట్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రస్తుతం వరల్డ్ గోల్ఫ్ ర్యాంకింగ్స్‌లో 222వ ర్యాంక్‌లో ఉన్న శుభాంకర్ శర్మ ఒలింపిక్స్ కటాఫ్‌లో 48వ స్థానంలో నిలవగా.. గగన్‌జీత్ 54వ ర్యాంక్ లో నిలిచి అర్హత సాధించాడు. కాగా వీరిద్దరికి ఇదే తొలి ఒలింపిక్స్ కావడం విశేషం. ఇక మహిళల విభాగం నుంచి 24వ ర్యాంకర్ అదితి అశోక్, 40వ ర్యాంకర్ దీక్షా డాగర్‌లు పారిస్ బెర్త్ దక్కించుకునే చాన్స్ ఉంది. జూన్ 24న అంతర్జాతీయ గోల్ఫ్ ఫెడరేషన్ మహిళల జాబితాను ప్రకటించనుంది.