25-04-2025 02:28:57 AM
కల్నల్ పరీక్షిత్ మెహ్రా అధ్యక్షతన ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ చివరి 50 మీటర్ల సహాయక చర్యలపై గురువారం జలసౌధలో నిపుణుల కమిటీ సమావేశమైంది. సొరంగంలో చివరి 50మీటర్ల సహాయక చర్యలపై కమిటీ చర్చించింది. సహాయ చర్యలు చేపట్టేందుకు డ్రిల్ అండ్ బ్లాస్ట్, డీబీఎం తప్ప మార్గం లేదని నిపుణులు అభిప్రాయపడ్డారు.
అయితే ఇందుకు పర్యావరణ నిబంధనలు అడ్డువస్తాయని అభిప్రాయపడ్డారు. దీనికోసం ప్రత్యేకంగా ఉపసం ఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎన్‌ఆర్‌ఎస్సీ, జీఎస్‌ఐ, ఎన్‌ఐఆర్‌ఎం, ఎన్జీఆర్‌ఐ, సీఐఎఫ్‌ఎంఆర్, ఎన్సీఎస్‌లతో కూడిన ఉప సంఘం ఏర్పాటుకు నిర్ణయించారు.
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో)లో ఆర్మీ అధికారి అయిన కల్నల్ పరీక్షిత్ మెహ్రాతో ఉపసంఘం ఏర్పాటుకు నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. కల్నల్ మెహ్రా సరిహద్దుల్లో పెద్ద సొరంగాల తవ్వకాల్లో ఎంతో అనుభవం ఉన్న అధికారి అని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది.