calender_icon.png 15 January, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు ఉద్యోగుల సమస్యలపై సబ్ కమిటీ భేటీ

19-07-2024 01:18:29 AM

317 జీవో సమస్యలు, ఉద్యోగుల అభ్యర్థనపై చర్చ

2008 డీఎస్సీ బాధితులకు ఉద్యోగాలిచ్చే అంశంపై నిర్ణయం

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): నేడు సాయంత్రం 4 గంట లకు ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు, 317 జీవో సమస్యలపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం కానున్నది. 317 జీవో ప్రభావిత ఉద్యోగుల అభ్యర్థనలపై మంత్రులు దామోదర రాజనర్సింహా, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ చర్చించనున్నారు. ఇప్పటికే స్పౌజ్, మెడికల్, మ్యూచువల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య/భర్త చేసుకున్న దరఖా స్తులపై కమిటీ గత సమావేశంలో సానుకూల నిర్ణయం తీసుకుంది. మిగతా దరఖాస్తులు, నివేదికలపై కమిటీ ఈ రోజు చర్చించనుంది. అలాగే, 2008 డీఎస్సీ బాధితులకు ఉద్యోగాలిచ్చే అంశంలో విధివిధానాలపై కూడా చర్చించనుంది. బాధితు లకు ఏపీ తరహాలో ఉద్యోగాలు ఇవ్వాలని మార్చి 14న జరిగిన సమావేశంలో క్యాబినెట్  తీసుకున్న నిర్ణ యాలకు అనుగుణంగా నేడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.