19-02-2025 12:00:00 AM
అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పరదా’. దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కిస్తున్న ఈ సినిమాను విజయ్ డొంకాల, శ్రీనివాసులు, పీవీ శ్రీధర్ మక్కువ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శన రాజేంద్రన్, సంగీత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
భిన్నమైన సోషియో డ్రామా కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో సుబ్బు అనే పాత్రలో కనిపించనుంది అనుపమ. మంగళవారం అనుపమ పరమేశ్వరన్ పుట్టిన రోజును పురస్కరించుకొని చిత్రబృందం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.
ఈ వీడియోలో ఓ మారుమూల పల్లెలో ఓ మామిడి చెట్టుకు చీరలతో కట్టిన ఊయలలో కూర్చొని, చేతిలో మెగాఫోన్ పట్టుకొని దర్శనమిచ్చింది అనుపమ. ప్రశాంతంగా ఊయల ఊగుతూ ‘పరదాలమ్మా పరదాలూ..
రంగురంగుల పరదాలూ.. డిజైనర్ పరదాలూ.. తీస్కోవాలమ్మా తీస్కోవాలి..’ అంటూ అనుపమ మెగాఫోన్‌లో అనౌన్స్ చేస్తుండటం ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.