calender_icon.png 15 January, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్

15-01-2025 04:37:12 PM

కోరుట్ల (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించి, సబ్ రిజిస్ట్రార్ ఆసిఫోద్దిన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం... మెట్ పల్లి పట్టణంలో సాయిరాం కాలనీలోని 266 గజాల స్థలంను మార్టిగేజ్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ పదివేలు డిమాండ్ చేశారు. మొదటి విడతలో రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బాధితుడు ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సుంకే విష్ణుగా తెలిసింది. మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ అసిఫోద్దీన్, ఔట్ సోర్సింగ్ అటెండర్ బాణోతు రవికుమార్, డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ ఆర్మూర్ రవిలను అదుపులోకి తీసుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.