calender_icon.png 8 April, 2025 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా బిల్లులో సబ్ కోటా అమలు చేయాలి

06-04-2025 12:19:32 AM

ఓబీసీ సెంట్రల్ కమిటీ జాతీయ అధ్యక్షురాలు ఎం.భాగ్యలక్ష్మి

ముషీరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): మహిళా బిల్లులో బీసీ మహిళకు సబ్ కోటాను అమలు చేయాలని ఓబీసీ సెంట్రల్ కమిటీ జాతీయ అధ్యక్షురాలు ఎం. భాగ్యలక్ష్మి అన్నారు. బలహీన వర్గాల మహిళలను నేటి పాలకులు కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో  ఓబీసీ  బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, దానకర్ణ చారీ అధ్యక్షతన మహిళా సదస్సు  జరిగింది.

ఈ సందర్బంగా ఓబీసీ మహిళ సెంట్రల్ కమిటీ అధ్యక్షురాలిగా డాక్టర్ పోశం సునీత శ్రీనివాస్ ను ఎన్ను కున్నారు. ఈ సందర్భంగా  సునీతను గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళా బిల్లు పాస్ కావడం కోసం గత రెండు దశాబ్దాలుగా జాతీయ ఓబీసీ మహిళా సమాఖ్య పోరాటం చేసి విజయం సాధించిందన్నారు.

42 శాతం బీసీ రిజర్వేషన్స్ అమలు చేసి అందులో మహిళలకు 50 శాతం ఇవ్వాలన్నారు. పోశం సునీత మాట్లాడుతూ ఓబీసీల హక్కుల కోసం పోరాడుతామన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు బీసీ మహిళ బిల్లులో సముచిత స్థానం కల్పించాలన్నారు. ఈ సమావేశంలో యు.చిన్నయ్య, కె.పరమేష్, రాము, సుజాత, శిరీష, శ్రీనిధి, మట్టా జయంతి తదితరులు పాల్గొన్నారు.