కేంద్రప్రభుత్వం తపాల శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందా అనిపిస్తోంది. మారిన కాలానికి తగ్గట్టుగా ఈ శాఖలో వేగం పెరగలేదు. ఎందుకంటే పలు చోట్ల ఉత్తరాలు సకాలంలో బట్వాడా కావడం లేదు. ఒక్కోసారి ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత కాల్ లెటర్స్ అంది అవకాశాలు కోల్పోతున్నామని నిరుద్యోగులు వాపోయిన సందర్భాలున్నాయి.దీనికి కారణం కనీసం మండల కేంద్రాల్లోనైనా సబ్ పోస్టాఫీసులు లేకపోవడం.
అవసరం లేని చాలా చోట్ల బ్రాంచ్ పోస్టాఫీసులనుసబ్‌పోస్టాఫీసులుగా మార్చారు. అలాంటి వాటిని ఎత్తివేసి మండలకేంద్రాల్లో తప్పనిసరిగా సబ్‌పోస్టాఫీసులు ఉండే లా చర్యలు తీసుకోవాలి. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ పోస్టాఫీసుల ప్రాధాన్యత తగ్గలేదు. గ్రామాల్లో ప్రజలు ఇప్పటికీ వీటినే నమ్ముతున్నారు. అందువల్ల అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
- సాగర్, గద్వాల