03-04-2025 12:57:46 AM
ఏప్రిల్ 02 , జగదేవపూర్. జగదేవపూర్ మండల పరిధిలోని మునిగడప ప్రభుత్వ పాఠ శాలలో సైబర్ మోసాలపై సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి. చంద్ర మోహన్ ఆధ్వర్యంలో సైబర్ జా గృత దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత పార్ట్ టైమ్ జాబ్ పేరుతో డబ్బులు పొగొట్టుకుంటున్న విధానం, క్రికెట్ బెట్టింగ్ ద్వారా డబ్బులు పోగొట్టుకునే విధానం, ఆన్లైన్ గేమ్స్ వాళ్ళ నష్టాలు, తెలియని వ్యక్తులతో ఫేస్బుక్, వాట్సాప్,లాంటి సోషల్ మీడియా సాధనల ద్వారా వారితో మోసగాళ్ళు పరిచయం.
పెంచుకుని డబ్బులు లాకుంటున్న విధానం తల్లిదండ్రులకు తెలియకుండా వారి ఫోన్ల నుండి డబ్బులను గుర్తు తెలియని వ్యక్తులకు పంపించి మోసపోతున్న విధానం మొదలగు విషయాల పై విద్యార్థులకు పాఠశాల యాజమాన్యానికి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.