calender_icon.png 29 April, 2025 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్ ఇంజినీర్ పోస్టులను త్వరితరగతిన పూర్తి చేయాలి

28-04-2025 01:47:50 AM

ముషీరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): డిప్లొమా అరతతో తెలంగాణ రాష్ర్ట విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్కో) 2017 డిసెంబర్ 26 న 174 సబ్ ఇంజినీర్  (ఎలక్ట్రికల్) పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్ ను త్వరితగతిన పూర్తి చేసి నబ్ ఇంజినీర్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ సిహె భద్ర చల్లూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సబ్ ఇంజినీర్ అభ్యర్థులు ఆదివారం రాష్ర్ట పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను ఆమె నివాసంలో కలిసి వినతిపత్రం  అందజేశారు.

అనంతరం వారు బషీర్బాగ్ లో  మీడియాతో మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా అనేక మార్లు విద్యుత్ సౌదా చుట్టూ తిరిగి అప్పటి సిఎండి ప్రభాకర్ రావు, సంబంధిత అధికారులను కలిసి వేడుకున్నప్పటికీ సాగదీసే ధోరణితో కాలయాపన చేశారన్నారు. నబ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) 2017 నియామక ప్రక్రియను నబ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) 2012 నియామక ప్రక్రియతో ముడిపెట్టి ఇటివల నమస్యగా మార్చి మమ్మల్ని మా కుటుంటాలను మనోవేదనకు గురిచేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యను పరిష్కరించాలని  అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగరీన్ రెడ్డి, మంత్రి కెటిఆర్ లను కలిసి వేడుకున్నా తమను చట్టించుకోలేదని వారు వెల్లడించారు. ఇప్పటి వరకు 2003లో సబ్ ఇంజినీర్ ఉద్యోగాలు కల్పించిన చరిత్ర  కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే ఉంద న్నారు. 2017 నుండి పెండింగ్లో ఉన్నఈ కేసును తక్షణమే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుని నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. 

ఈ విషయంపై మంత్రి సీతక్క సానుకూలంగా   స్పందిస్తూ సబ్ ఇంజినీర్ల సమస్యల ను సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్ళి న్యాయవరమైన సమస్యలకు ప్రభుత్వం నుండి న్యాయం జరిగేలా తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ వచ్చినట్లు వారు వెల్లడించారు. మంత్రిని కలిసి రాంబాబు, డైద శివకుమార్ ప్రహ్లాడ్ జూపాక శ్రీనిధాన్.ఎం.ఎస్‌ఆర్, ప్రముఖ రచయిత కరీం తదితరులు ఉన్నారు.