calender_icon.png 24 February, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

24-02-2025 12:23:08 AM

పిట్లం ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఆదివారం 2025-26 సంవత్సరానికి గాను ప్రవేశ పరీక్ష నిర్వహించారు.ఈ పరీక్షా కేంద్రాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మిక తనిఖీ చేసి, పరీక్షా కేంద్రం నిర్వహించే విధానాన్ని ,హాజరు వివరాలను ప్రధానోపాధ్యాయురాలు కవితను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి  చేరుకున్నారని, అలాగే మొత్తం 181 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవ్వాల్సి ఉండగా, ఇద్దరు విద్యార్థులు మాత్రమే గైర్హాజరయ్యారని ప్రధానోపాధ్యాయురాలు కవిత తెలిపారు.