06-03-2025 07:00:52 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్కోల్ మండలంలోని శివారులో ఉన్న ఠాగూర్ జూనియర్ కళాశాల ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని గురువారం సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు పరీక్ష కేంద్ర నిర్వాహకులకు సూచించారు. కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.