13-03-2025 11:06:10 PM
మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని సీహెచ్సీ ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ స్థలం దగ్గర అపరిశుభ్రంగా ఉండటంతో స్టాఫ్ నర్సుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు అందుబాటులో ఉండాలని, సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. చికిత్సకుల రిజిస్ట్రార్ పరిశీలించారు. రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.హాస్పిటల్ మొత్తం కలియతిరిగి రోగులకు అందుతున్న వైద్యం గురించి ఆరా తీసారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. బాలింతలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.సబ్ కలెక్టర్ వెంట మద్నూర్ తహశీల్దార్ ఎండీ ముజీబ్ ఉన్నారు.