04-04-2025 12:00:00 AM
మద్నూర్, ఏప్రిల్ 3 (విజయ క్రాంతి),కామారెడ్డి జిల్లా మద్నూర్ తాసిల్దార్ కార్యాలయంలో గురువారం సాయంత్రం బాన్సువాడ సబ్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి ధరణి, ఇతర సమస్య లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ధరణి పైన ఇతర సమస్యల పైన తాసిల్దార్ ఎండి ముజీబ్ తో మాట్లాడారు. రికార్డులను పరిశీలించారు. సబ్ కలెక్టర్ నిర్వహించిన సమీక్ష పరిశీలనలో మద్నూర్ తాసిల్దార్ ఎండి ముజీబ్, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.